ఖమ్మం నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులు గురువారం జిల్లా పరిషత్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న అదనపు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ధర్నా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో తోటి పారిశుధ్య కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ధర్నాను విరమించారు.



