Sunday, 16 August 2026
  • Home  
  • బాలల హక్కుల పరిరక్షణలో విశిష్ట సేవలకు అలర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రశంసా పత్రం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాలల హక్కుల పరిరక్షణలో విశిష్ట సేవలకు అలర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థకు ప్రశంసా పత్రం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నిరోధం తదితర అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న అలర్ట్ స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశంసా పత్రంతో సత్కరించింది. ఆగస్టు 15న అమలాపురంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రావిరాల, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా, ఐ. మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అలర్ట్ సంస్థ వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖ, డీసీపీయూ, ఐసీడీఎస్, కార్మిక శాఖ మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయంతో పనిచేస్తోంది. అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నిరోధం, బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది.ముఖ్యంగా జిల్లాలోని ఆలయాలు, చర్చిలు, మసీదులు మరియు ఇతర ప్రార్థనా స్థలాల్లో బాల్య వివాహాలకు తావులేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు మరియు చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. బాలల భద్రత, విద్య, హక్కులు మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సంస్థ చేస్తున్న కృషిని జిల్లా యంత్రాంగం అభినందించింది. ఈ సందర్భంగా అలర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస్ మరియు జిల్లా కో-ఆర్డినేటర్ కె. వెంకటేశ్వరరావు సంస్థ తరఫున ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.ప్రభుత్వపరంగా లభించిన ఈ గుర్తింపు అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని అందించిందని, భవిష్యత్తులో కూడా జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనతో పాటు బాలల హక్కుల పరిరక్షణ కోసం మరింత విస్తృతంగా పనిచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నిరోధం తదితర అంశాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందిస్తున్న అలర్ట్ స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించిన జిల్లా యంత్రాంగం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రశంసా పత్రంతో సత్కరించింది.
ఆగస్టు 15న అమలాపురంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రావిరాల, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా, ఐ.
మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు ప్రశంసా పత్రం అందజేశారు.
జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అలర్ట్ సంస్థ వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసు శాఖ, డీసీపీయూ, ఐసీడీఎస్, కార్మిక శాఖ మరియు ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయంతో పనిచేస్తోంది. అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నిరోధం, బాలల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోంది.ముఖ్యంగా జిల్లాలోని ఆలయాలు, చర్చిలు, మసీదులు మరియు ఇతర ప్రార్థనా స్థలాల్లో బాల్య వివాహాలకు తావులేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు మరియు చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. బాలల భద్రత, విద్య, హక్కులు మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం సంస్థ చేస్తున్న కృషిని జిల్లా యంత్రాంగం అభినందించింది.
ఈ సందర్భంగా అలర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ స్టేట్ కో-ఆర్డినేటర్ ఎస్. శ్రీనివాస్ మరియు జిల్లా కో-ఆర్డినేటర్ కె. వెంకటేశ్వరరావు సంస్థ తరఫున ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.ప్రభుత్వపరంగా లభించిన ఈ గుర్తింపు అలర్ట్ స్వచ్ఛంద సంస్థకు మరింత బాధ్యతను, ఉత్సాహాన్ని అందించిందని, భవిష్యత్తులో కూడా జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనతో పాటు బాలల హక్కుల పరిరక్షణ కోసం మరింత విస్తృతంగా పనిచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.