*కలెక్టర్‌కు రాఖీ కట్టిన విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు*
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 28. ( పున్నమి ప్రతినిధి )
రాఖీ పండుగను పురస్కరించుకుని స్థానిక విజ్ఞాన భారతి పాఠశాల విద్యార్థినులు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు విద్యార్థినులు రాఖీలు కట్టి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థినులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి, వారి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు చూపిన ఆప్యాయతకు కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.

