Friday, 28 August 2026
  • Home  
  • రాఖీ పౌర్ణమి వేళ మంత్రపురి రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

రాఖీ పౌర్ణమి వేళ మంత్రపురి రాజరాజేశ్వరుడికి ప్రత్యేక పూజలు

పెద్దపల్లి/మంథని, ఆగస్టు 28: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీ మంత్రపురి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి గోముఖం, సౌండ్ సిస్టమ్ అందజేసిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

పెద్దపల్లి/మంథని, ఆగస్టు 28:
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీ మంత్రపురి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి గోముఖం, సౌండ్ సిస్టమ్ అందజేసిన దాతలకు ఈ సందర్భంగా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.