మంథని, ఆగస్టు 28:
మంథని పట్టణంలోని అన్ని వాడల్లోని దేవాలయాల్లో శుక్రవారం నూతన యజ్ఞోపవిత్రధారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ హనుమాన్ దేవాలయం లో వేద పండితులు అవధానుల పురుషోత్తం శర్మ, కిషోర్ శర్మ లు హోమగుండం ఏర్పాటుచేసి వేదమంత్రాలతో బ్రాహ్మణులచే నూతన యజ్ఞోపవీతము వేయించారు. ఉపవీతాలు యజ్ఞోపవీతాలు దారం పోగులచే మూడు వరసలుగా చేసి బ్రహ్మముడితో చేయబడినది (జంధ్య ము) యజ్ఞోపవీతం. హిందువులు దారపు పోగులనే ధర్మం కోసం అన్ని కార్యక్రమాల్లోనూ ఉపయోగిస్తారు. స్త్రీలు వ్రత తోరణాలు, మంగళసూత్రం మొదలగు వాటికి దారపు పోగులను ఉపయోగించడం ఉదాత్త భాగంగా పరిగణిస్తారు. అలాగే ఈ రోజున సోదరీ సోదరీమణులు సోదరులకు రక్షాబంధన్ కట్టి ఆశీర్వాదం పొందుతారు.




