Friday, 28 August 2026
  • Home  
  • లక్షరూపాయలతో విశేషాలంకరణ
- ఆంధ్రప్రదేశ్

లక్షరూపాయలతో విశేషాలంకరణ

యలమంచిలి (పున్నమి రిపోర్టర్): శ్రావణమాసం మూడో శుక్రవారం వారం సందర్భంగా అందలపల్లి కొండపై కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ భగీరథి అమ్మవారికి రూ.1,00,001 విలువైన కరెన్సీ నోట్లతో విశేష అలంకరణ నిర్వహించారు. శారదా నది ప్రవాహ పరిసర ప్రాంతంలో వెలసిన అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు.పుష్పాలు, పండ్లు, దీపాలు, వివిధ రకాల ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి సన్నిధి భక్తి శోభతో కళకళలాడింది. హరిపాలెం, అందలపల్లి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొలిచే భగీరథి అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.ప్రత్యేక అలంకరణలో భగీరథి అమ్మవారి దివ్య దర్శనంశ్రావణమాసం మూడో వారం సందర్భంగా నిర్వహించిన ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో అందలపల్లి కొండ ప్రాంతం కళకళలాడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.