నంద్యాల : స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రైతోద్యమ రథసారథి, బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఏఆర్ అదనపు ఎస్పీ చిన్నికృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గౌతు లచ్చన్న స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు రైతులు, కూలీల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు సురేష్, బాబు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

గౌతు లచ్చన్నకు ఘన నివాళి