Thursday, 10 September 2026

Tag: Police

కాకినాడ

గంజాయి సమాచారం ఇచ్చి బహుమతి గెలుచుకోండి!

గంజాయి సమాచారం ఇచ్చి బహుమతి గెలుచుకోండి.. అంటున్న కాకినాడ జిల్లా పోలీసులు “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పేరుతో భారీ అవగాహన సదస్సు నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీస్ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పేరుతో విద్యార్థులు, యువత మరియు ప్రజలకు గంజాయికి వ్యతిరేకంగా విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు విద్యార్థులు, యువత మరియు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పోస్టర్ ను ఎస్పీ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. “సమాచారం ఇవ్వండి – సమాజాన్ని కాపాడండి”, “గంజాయి రహిత సమాజం – మనందరి బాధ్యత” అనే నినాదాలతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, విలువైన సమాచారాన్ని అందించిన వారికి తగిన బహుమతి కూడా అందజేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు తెలిపారు. గంజాయి సమాచారాన్ని ఇలా అందించండి: 📞 1972 – గంజాయి సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ 📞 112 – అత్యవసర పోలీసు సేవలు 📱 కాకినాడ పోలీస్ వాట్సాప్ నంబర్: 9494933233

కాకినాడ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు

**kakinada_district_police** సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు రానున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివస్) లో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం కాకినాడ రోటరీ క్లబ్, యువసేన బ్లడ్ బ్యాంక్ మరియు కాకినాడ జీజీహెచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ జిల్లా, కాకినాడ, పోలీస్ కళ్యాణ మండపం వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 09.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో కాకినాడ జిల్లాకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 111 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ… ఆపదలో ఉన్నవారికి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో విలువైనదని, ఒక యూనిట్ రక్తదానం చేయడం ద్వారా పలువురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడంలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి, ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. ఏక్తా దివస్ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, పెద్దాపురం డిఎస్పీ శ్రీ ఎబిజి తిలక్, ఏ ఆర్ డిఎస్పీ శ్రీ వి జి శ్రీహరి రావు, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ కె వెంకటరావు, శ్రీ ఎం నరసింహ మూర్తి, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు పెద్దసంఖ్యలో కాకినాడ జిల్లా యువత పాల్గొన్నారు. అలాగే ఈ నెల 31వ తేదీన కాకినాడ, పోలీస్ కళ్యాణ మండపం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.

నంద్యాల

గౌతు లచ్చన్నకు ఘన నివాళి

నంద్యాల : స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రైతోద్యమ రథసారథి, బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఏఆర్ అదనపు ఎస్పీ చిన్నికృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గౌతు లచ్చన్న స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు రైతులు, కూలీల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఐలు సురేష్, బాబు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నంద్యాల నూనెపల్లెలోని నంద్యాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాజీ సైనికులతో కలిసి పతాక వందనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు సాధించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ దేశ రక్షణలో సైనికులు, మాజీ సైనికులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని అన్నారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఐఎంఏ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, ప్రధాన కార్యదర్శి గురవయ్య, కోశాధికారి జయరావు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*మల్లు పెళ్లి వేడుక– సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని భట్టి ఆహ్వానం *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 05 : గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు. గురువారం వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – KLR సమీక్షించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… వీఐపీ పార్కింగ్ / సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లోఎలాంటఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్ / వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు KLR కార్యాలయం సిబ్బంది తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట సీఐ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి పండుగ సందర్భంగా నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. శ్రీనివాస్ రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –“ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబం సంతోషసమృద్ధులతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ –“వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అపశృతులకు తావులేకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జరుపుకోవాలి. పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.

పెద్దపల్లి

తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించిన పోలీస్ డాగ్

రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ డాగ్ “సింబా” ఎంపిక రామగుండం, ఆగస్టు 04, పున్నమి ప్రతినిధి: వరంగల్ జిల్లా మమునూరు పిటిసిలో జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ లో కాళేశ్వరం జోన్ నుండి నార్కోటిక్ డాగ్ విభాగం పోటీలో పాల్గొనీ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించడం లో పోలీసు జాగిలం సింబా, డాగ్ హ్యాండ్లర్ ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేణుగోపాల్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అదేవిదంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పోలీస్ డాగ్ గా “సింబా” ఎంపిక కావడం జరిగింది. సోమవారం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తమ కార్యాలయంలో నార్కోటిక్ డాగ్ సింబా, డాగ్ హాండ్లర్ ను అభినందించడం జరిగింది. 2026 సంవత్సరం ఫిబ్రవరిలో పూణేలో జరిగే నేషనల్ పోలీసు డ్యూటీ మీట్ లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలని తెలంగాణ రాష్ట్రానికి, రామగుండం పోలీస్ కమీషనరేట్ కి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి

ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.

*డ్రైవర్స్ ఏ చిన్న తప్పు చేసినా.. స్కూల్ యాజమాన్యందే బాధ్యత.* *ప్రతి స్కూల్ బస్సులోను తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.* *_పెద్దపల్లి డీసీపీ కరుణాకర్_* రామగుండం, జులై 30, పున్నమి ప్రతినిధి:  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అడ్డగుంటపల్లి లోని ఆద్య బ్యాంకెట్ హాల్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్, గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని స్కూల్, కళాశాల యజమానులు, బస్ డ్రైవర్లకు బుధవారం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, పలు ఆదేశాలు, సూచనలు చేశారు. స్కూల్, కళాశాలల యాజమాన్యాలు నైపుణ్యం గల డ్రైవర్లను నియమించుకోవాలని, పిల్లలను బస్సు ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బస్సులను నిలుపుదల చేయాలన్నారు. డ్రైవర్లు ఓవర్ టేకింగ్ చేయవద్దని సూచించారు. బస్సు డ్రైవర్లు మద్యం సేవించి, సెల్ఫోన్లు ఉపయోగించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్ లలో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. బస్సులో సీట్లకు సరిపడా విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లాలని డీసీపీ పేర్కొన్నారు. స్కూల్ బస్సు డ్రైవర్ లకు పోలీస్ వారి తరుపున ముఖ్యమైన సూచనలు చేశారు. పిల్లల భద్రత కోసం డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, విద్యార్థులను ఎక్కించేటప్పుడు, బస్సు దించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, బస్సును క్రమం తప్పకుండా ప్రతి రోజూ తనిఖీ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, మూల మలుపుల వద్ద, ప్రధాన కూడల్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని, విద్యార్థుల భద్రత కోసం బస్  పూర్తిగా ఆగిన తరువాత పిల్లలను ఎక్కించడం, దించడం కోసం ఒక వ్యక్తిని విద్యార్థులకు సహాయంగా ఏర్పాటు చేయాలని, టైర్లు, బ్రేక్లు, ఇతర ముఖ్యమైన భాగాలను పరిశీలించాలని, ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని యాజమాన్యం కు చెప్పి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులను అప్రమత్తంగా ఉంచడం కోసం విద్యార్థులకు బస్సు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పించాలని, బస్సులో ప్రవర్తన ఎలా ఉండాలో వారికి చెప్పాలని కోరారు. విద్యార్థులు బస్సులో సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యత వహించాలనే విషయం గుర్తుంచుకోవాలని, మొదటగా ప్రథమ చికిత్స కిట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని,  బస్సులో అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి బస్సును నడపడానికి ప్రయత్నించాలని, విద్యార్థులతో ఓపిక, సహనంగా ఉంటూ మంచి ప్రవర్తనతో ఉండాలని, పిల్లలకు ఏదైనా సమస్య తలెత్తితే, దానిని పరిష్కరించడానికి, యాజమాన్యం, తల్లితండ్రుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నించాలని, అవసరమైనప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, బస్సులో భద్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు మద్యం మత్తులో స్కూల్ బస్సులు నడిపినట్లు గుర్తిస్తే అలాంటి వారిపై ఎట్టి పరిస్థితుల ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని, ఏదైనా ప్రమాదం జరిగితే స్కూల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై నమోదు చేయు కేసులు, శిక్షల గురించి వివరించారు. అతివేగంగా అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురి చేయడం వలన మరణం సంభవిస్తే – 106(1) BNS [304-A IPC], సిగ్నల్ జంప్ చేసిన సందర్భం, రాంగ్ రూట్ లో వెళ్ళిన సందర్భంలో మరణం సంభవిస్తే, బలమైన సందర్భంలో – 105 BNS [304(ii) IPC], అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ఒక వ్యక్తికి – సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125(a) BNS [337 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో –  125(b) BNS [338 IPC], పట్టణ ప్రాంతంలో, రద్దీ ప్రదేశాలలో, సాధారణ సమయంలో అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు  నడిపినచో సాధారణ గాయాలు అయిన సందర్భంలో – 125 BNS [336 IPC], బలమైన గాయాలు అయిన సందర్భంలో – 281 BNS [279 IPC], మైనర్ కి వాహనం ఇచ్చి ప్రమాదానికి గురి చేసినట్లయితే – 180 MV Act, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే – 3 r/w 181 MV Act, మద్యం తాగి వాహనం నడినట్లయితే – 185 MV Act, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినట్లు అయితే – 196 MV Act, సెక్షన్ల ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, మంథని సీఐ రాజు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్ అనూష, ఎన్టిపిసి ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్సై వెంకటేష్, కమాన్పూర్ ఎస్సై ప్రసాద్, రామగిరి ఎస్సై శ్రీనివాస్, మంథని ఎస్ఐ రమేష్, ముత్తారం ఎస్సై నరేష్, స్కూల్స్ కళాశాల ప్రిన్సిపల్స్, డ్రైవర్స్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది: సీపీ అంబర్ కిషోర్ ఝా

*భాద్యతగా పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది* *_రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా_* రామగుండం, జులై 22, పున్నమి ప్రతినిధి: వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ కి స్టేషన్ పోలీస్ అధికారులు పుష్ప గుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్టేషన్ లోని పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఈ ప్రాంతంలోని మావోయిస్టులు, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏవిదంగా నియంత్రణ చేయాలనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలని సిబ్బందిని ఆదేశించారు. పారదర్శకంగా పోలీసింగ్ ఉండాలని ప్రజలకు పోలీసు సేవలను వేగంగా అందించాలని సిబ్బందికి తెలిపినారు. గంజాయి రవాణా, వినియోగం నిరోధించేలా బాధ్యతగా పని చేయాలని అన్నారు. పెట్రోలింగ్ పెంచాలని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది వేగంగా స్పందించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పని చేయాలని అన్నారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని కోరారు. భాద్యతగా పని చేసే సిబ్బందికి రీవార్డ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. ఇదే క్రమంలో పోలీస్ కమిషనర్ అధికారులతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.