అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రేపపోలవరం గ్రామానికి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరచి గ్రామానికి గర్వకారణమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు విద్యార్థులను హారాలతో సత్కరించి అభినందించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.



