అనకాపల్లి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్): అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు ఉన్న రహదారి దయనీయ స్థితిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీఆర్ బాండ్ల ద్వారా కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని న్యాయస్థానం గమనించింది. రోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో గుంతలు, దుమ్ము వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. స్థానిక ప్రజలు, వాహనదారులు త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు



