వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాలు జాతి ఐక్యతకు, అభివృద్ధికి, సంక్షేమానికి, భద్రతకి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై నేను కూడా భరోసా కేంద్రాల ద్వారా నా పరిధిలో నేను మన కుటుంబ సభ్యుల సంక్షేమానికి భరోసా ఇస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందున భావిశెట్టి కిరణ్ గారిని…
- అంటూ స్వచ్ఛందంగా జాతి సంక్షేమానికి కృషి చేసే వారిని భరోసా కేంద్రాలలోకి ఆహ్వానించడం జరుగుతుంది అని దాని ద్వారా మనలో ఐక్యత పెరిగి మన అభివృద్ధికి ,మన సంక్షేమానికి ,భద్రతకి ఎంతో పడుతుందని తెలిపారు.మరిన్ని వివరాలకు 8500635995కు కాల్ చేసి తెలుసుకోవాలని భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి…
శ్రీ కృష్ణదేవరాయ సంక్షేమ భరోసా కేంద్రాలు జాతి ఐక్యతకు, అభివృద్ధికి, సంక్షేమానికి, భద్రతకి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై నేను కూడా భరోసా కేంద్రాల ద్వారా నా పరిధిలో నేను మన కుటుంబ సభ్యుల సంక్షేమానికి భరోసా ఇస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందున భావిశెట్టి కిరణ్ గారిని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గానికి భరోసా కన్వీనర్ గా నియమించడమైనది.ఈ సందర్భంగా భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ బావిశెట్టి కిరణ్ గారు యువ వ్యాపారవేత్త, యూ.పీ.వీ.సీ వ్యాపార రంగంలో ఉన్నారు అంతేకాకుండా ఆయన కమ్యూనిటీ ఐక్యత కోసం ఎంతో సేవ చేసి ఉన్నారు, వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, ఇతర రంగాలలో కూడా అనేక మందితో పరిచయాలు ఉన్నాయి ,భరోసా కేంద్రాల ఆశయాలు కనుగుణంగా భవిష్యత్తులో జాతి ఐక్యతకు ,అభివృద్ధికి, తనకున్న అనుభవం ఉపయోగపడుతుందని తెలిపారు.ఇదేవిధంగా మిగతా ప్రాంతాల నుండి కూడా నేను సైతం…. అంటూ స్వచ్ఛందంగా జాతి సంక్షేమానికి కృషి చేసే వారిని భరోసా కేంద్రాలలోకి ఆహ్వానించడం జరుగుతుంది అని దాని ద్వారా మనలో ఐక్యత పెరిగి మన అభివృద్ధికి ,మన సంక్షేమానికి ,భద్రతకి ఎంతో పడుతుందని తెలిపారు.మరిన్ని వివరాలకు 8500635995కు కాల్ చేసి తెలుసుకోవాలని భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రి వెంకటరమణ తెలిపారు.