Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీపీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీపీ మండల్ జయంతి వేడుకలు ఘనంగా

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి) గూడూరు పట్టణంలో బీసీ సమస్యయ కమిటీ ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రెండో బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) 108వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.
  • గూడూరు కార్‌స్టాండ్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 25 (పున్నమి ప్రతినిధి)
గూడూరు పట్టణంలో బీసీ సమస్యయ కమిటీ ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రెండో బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) 108వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గూడూరు కార్‌స్టాండ్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటాన్ని నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు, మేధావులు, అభ్యుదయవాదులు పాల్గొన్నారు. ఎల్‌వీ సుబ్బయ్య, నాసిన భాస్కర్‌గౌడ్, జి.వెంకటేశ్వరరాజు, యాల్లపల్లి శ్రీనివాసులు, పొల్లేపల్లి రమణరావు, చిల్లకూరు వేమయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *