Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

• ప్రాణాలు కాపాడే 108 కోసం మాచర్ల ప్రజల ఎదురుచూపులు • రిఫర్ కేసుతో 5 గంటలు బందీ.. అత్యవసర సేవలకు అంతరాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
• ప్రాణాలు కాపాడే 108 కోసం మాచర్ల ప్రజల ఎదురుచూపులు • రిఫర్ కేసుతో 5 గంటలు బందీ.. అత్యవసర సేవలకు అంతరాయం

వార్త ముఖ్యాంశాలు

  • మాచర్ల, ఆగష్టు 20 (అమరలింగం - పున్నమి ప్రతినిధి): అత్యవసర వేళల్లో ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవలు మాచర్లలో అందుబాటులో లేకుండా పోతున్నాయి.
  • నియోజకవర్గ కేంద్రమైన మాచర్లకు ఒక్క 108 వాహనమే ఉండటంతో వందలాది అత్యవసర కేసులకు ఆ వాహనంపై తీవ్రమైన భారం పడుతోంది.రిఫర్ కేసుతో 5 గంటలు బందీ మాచర్లలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో మాచర్లతో పాటు వెల్దుర్తి, దుర్గి, విజయపురిసౌత్, రెంటచింతల తదితర మండలాల నుంచి…
  • ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రిఫర్ చేసే కేసులు అధికంగా ఉంటున్నాయి.

మాచర్ల, ఆగష్టు 20 (అమరలింగం – పున్నమి ప్రతినిధి): అత్యవసర వేళల్లో ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్ సేవలు మాచర్లలో అందుబాటులో లేకుండా పోతున్నాయి. నియోజకవర్గ కేంద్రమైన మాచర్లకు ఒక్క 108 వాహనమే ఉండటంతో వందలాది అత్యవసర కేసులకు ఆ వాహనంపై తీవ్రమైన భారం పడుతోంది.రిఫర్ కేసుతో 5 గంటలు బందీ మాచర్లలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండటంతో మాచర్లతో పాటు వెల్దుర్తి, దుర్గి, విజయపురిసౌత్, రెంటచింతల తదితర మండలాల నుంచి ప్రమాదాలు, ప్రసవాలు, ఇతర అత్యవసర కేసులు ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రిఫర్ చేసే కేసులు అధికంగా ఉంటున్నాయి. ఒక రిఫర్ కేసును నరసరావుపేటకు తీసుకెళ్లి తిరిగి రావడానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. ఈ సమయంలో స్థానికంగా మరో అత్యవసర కేసు వస్తే 108 అందుబాటులో లేకపోవడంతో రోగులు, బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమీప మండలాల నుంచి అంబులెన్స్ రావాల్సి వస్తుండటంతో విలువైన సమయం వృథా అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.8 నెలల్లో 1.15 లక్షల కి.మీ పరుగులు సుమారు 8 నెలల క్రితం మాచర్లకు వచ్చిన 108 అంబులెన్స్ ఇప్పటివరకు 1.15 లక్షల కిలోమీటర్లు పైగా ప్రయాణించినట్లు సమాచారం. ఇంత తక్కువ సమయంలోనే లక్ష కి.మీ. దాటడం ద్వారా మాచర్ల పరిధిలో 108 సేవలకు ఉన్న డిమాండ్ ఎంత ఉందో అర్థమవుతోంది.మరో 108 కేటాయించాలని డిమాండ్ నియోజకవర్గ కేంద్రంతో పాటు 4-5 మండలాలకు మాచర్ల ఆసుపత్రి రిఫరల్ కేంద్రంగా ఉండటంతో అదనంగా మరో 108 అంబులెన్స్‌ను కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక వాహనం రిఫర్ కేసుతో బయటకు వెళ్లినా స్థానికంగా మరో వాహనం అందుబాటులో ఉండేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.”అత్యవసర వేళల్లో అంబులెన్స్ కోసం ఎదురుచూపులు ఉండకూడదు. ప్రాణాలతో ముడిపడిన ఈ సమస్యను అధికారులు తక్షణం పరిష్కరించాలి” అని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *