ఖమ్మం: నిబంధనలు పాటించని ఇంటర్ కళాశాలలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) పున్నమి ప్రతినిధికి తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన హడావుడి పూర్తయిందని, ఇక నిబంధనలు పాటించని కళాశాలలపై దృష్టి సారిస్తామని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆయా కళాశాలలను అధికారులు తప్పకుండా విజిట్ చేసి తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కళాశాలలను గుర్తించిన అనంతరం సంబంధిత యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రతను బట్టి తదుపరి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల భద్రత, విద్యా ప్రమాణాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.



