Tuesday, 18 August 2026
  • Home  
  • కొండాపూర్ లో 10 30 కుటుంబాలకు నూతన రేషన్ కార్డు పంపిణీ
- రాజన్న సిరిసిల్ల

కొండాపూర్ లో 10 30 కుటుంబాలకు నూతన రేషన్ కార్డు పంపిణీ

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. లబ్ధిదారులు రేషన్ కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఉన్నత విద్య తదితర అవసరాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని గంతరాజు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందిస్తున్నారని పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి 1,030 నూతన రేషన్ కార్డులు రావడంతో గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత చేరువవుతాయని గంతరాజు అన్నారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 18 (పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. లబ్ధిదారులు రేషన్ కార్డులు అందుకుని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఉన్నత విద్య తదితర అవసరాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని గంతరాజు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందిస్తున్నారని పేర్కొన్నారు. కొండాపూర్ గ్రామానికి 1,030 నూతన రేషన్ కార్డులు రావడంతో గ్రామస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత చేరువవుతాయని గంతరాజు అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.