తిరుమల ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించు కొని సోమవారం తిరుమలలో శ్రీమలయప్ప స్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడు నిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది.శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తా రు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.గరుడ వాహనసేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


