పున్నమి: రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం వైద్య నగర్ రోడ్డులోని శ్రీ ఇందు పీజీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ హంగ్రీ హోటల్‌ను పగడాల టింకు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు పగడాల టింకు మాట్లాడుతూ.. తమ హోటల్లో శాఖాహార, మాంసాహార శాండ్విచ్లు, బర్గర్లు, మోమోలు, మిల్క్‌షేక్‌లు, షవర్మా, ఐస్‌క్రీమ్‌లు, స్ప్రింగ్ పొటాటో, పాస్తా, మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ కబాబ్స్ తదితర రుచికరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వినియోగదారులు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మిస్టర్ హంగ్రీ’ పేరుతో తమ పేజీని అనుసరించి హోటల్లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు, ప్రత్యేక ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. స్థానిక ప్రజల ఆదరణతో హోటల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పగడాల టింకు అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



