Wednesday, 19 August 2026

Tag: వనస్థలిపురం

రంగారెడ్డి

“మిస్టర్ హంగ్రీ ”హోటల్ ప్రారంభం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం వైద్య నగర్ రోడ్డులోని శ్రీ ఇందు పీజీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ హంగ్రీ హోటల్‌ను పగడాల టింకు ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు పగడాల టింకు మాట్లాడుతూ.. తమ హోటల్‌లో శాఖాహార, మాంసాహార శాండ్‌విచ్‌లు, బర్గర్లు, మోమోలు, మిల్క్‌షేక్‌లు, షవర్మా, ఐస్‌క్రీమ్‌లు, స్ప్రింగ్ పొటాటో, పాస్తా, మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ కబాబ్స్ తదితర రుచికరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వినియోగదారులు సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మిస్టర్ హంగ్రీ’ పేరుతో తమ పేజీని అనుసరించి హోటల్‌లో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు, ప్రత్యేక ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. స్థానిక ప్రజల ఆదరణతో హోటల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పగడాల టింకు అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

మన్సూరాబాద్లో ‘శ్రీ రేణుక ఎల్లమ్మ పూజ స్టోర్’ ఘనంగా ప్రారంభం, హోల్సేల్ ధరకే అన్ని రకాల పూజ సామాగ్రి లభించును.

పున్నమి: మన్సూరాబాద్: మన్సూరాబాద్ లోని కేబీఆర్ కన్వెన్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ రేణుక ఎల్లమ్మ పూజ స్టోర్’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నిర్వాహకులు జొన్నలగడ్డ రామాంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమాని జొన్నలగడ్డ రామాంజనేయులు మాట్లాడుతూ.. భక్తులకు కావాల్సిన అన్ని రకాల పూజా సామాగ్రి స్టోర్ లో అందుబాటులో ఉందని తెలిపారు. స్టోర్ రోజూ చేసుకునే పూజలతో పాటు వ్రతాలు, నోములు, హోమాలు, పెళ్లిళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు అవసరమైన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది. ముఖ్యంగా రకరకాల సైజుల్లో అమ్మవారి విగ్రహాలు, కొత్త డిజైన్లలో ఉండే దేవుళ్ల విగ్రహాలు ప్రత్యేకంగా తెప్పించాం. ఇత్తడి, రాగి పూజా సామాన్లు, దీపాలు, పంచపాత్రలు, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగర్బత్తులు, సాంబ్రాణి, పూజలకు వాడే పట్టు వస్త్రాలు, పీటలు, రుద్రాక్ష మాలలు, ఫోటోలు అన్నీ మంచి క్వాలిటీతో, రీజనబుల్ రేట్లకే ఇస్తున్నాం. ఏదైనా పూజ ఉంటే దానికి కావాల్సిన లిస్ట్ మొత్తం కిట్ లాగా కూడా ప్యాక్ చేసి ఇస్తాం”లి అని ఆయన తెలిపారు. ఇప్పటికే తమకు బోడుప్పల్, నాగోల్, కుంట్లూరు, హయత్నగర్లో బ్రాంచీలు ఉన్నాయని, అక్కడ కస్టమర్ల నుంచి మంచి సపోర్ట్, నమ్మకం లభించడంతోనే ఇప్పుడు మన్సూరాబాద్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశామని రామాంజనేయులు చెప్పారు. స్థానిక ప్రజలు తమ షాపుకు వచ్చి సేవలని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రాము గణేశుల సుబ్బారావు, గణేశుల శివ ముఖ్య అతిథులుగా వచ్చి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.