ఖమ్మం జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు బండ్ల రిగన్ ప్రతాప్ ఆదివారం ప్రకటించారు. పార్టీ బలోపేతం, ఎస్సీ వర్గాల సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆయన సూచించారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.



