జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని అంతర్జాతీయ నేర ముఠాపై అమెరికా న్యాయశాఖ సంచలన అభియోగాలు నమోదు చేసింది. 2022 నుంచి 2026 మధ్య ప్రముఖ భారతీయ నటుడు ‘ఎస్.కే.’ను హత్య చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించాలని బిష్ణోయ్ కుట్ర పన్నినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొంది. వివరాలు నటుడు సల్మాన్ ఖాన్‌కు గతంలో వచ్చిన బెదిరింపులతో సరిపోతున్నాయి. భారతదేశంలో యువకులను డబ్బు, పేరు ఆశ చూపించి గ్యాంగ్‌లో చేర్చుకుని, తరువాత వారిని అమెరికా, కెనడా వంటి దేశాలకు పంపించి నేర కార్యకలాపాలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటివరకు 37 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.

ల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలనే కుట్ర.. బిష్ణోయ్ గ్యాంగ్‌పై అమెరికా అభియోగాలు