దేశ రాజధాని ఢిల్లీతో పాటు గురుగ్రామ్, లక్నో వంటి నగరాల్లో పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్, లక్నోలో జరిగిన అగ్నిప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడానికి భద్రతా నిబంధనలు పాటించని భవనాలే కారణమని కోర్టు పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మున్సిపల్ సంస్థలు అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించింది. గురుగ్రామ్‌లో 93 శాతం భవనాలు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించడం లేదన్న నివేదికపై కూడా కోర్టు స్పందించింది. సంబంధిత అధికారులు ఆగస్టు 4లోపు తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోండి: సుప్రీంకోర్టు