అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం చారిత్రాత్మకంగా నిలిచింది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు.
వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా ఉచితంగా అందించారు. 548 మందికి ఉచితంగా వస్తి కర్మ నిర్వహించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని గుర్తించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. టి. సుందర రాజ్ పెరుమాల్‌కు అందజేశారు.
ఈ మెగా శిబిరానికి “సౌత్ ఇండియన్ చరక”గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి మార్గదర్శకత్వం వహించారు. కార్యక్రమ విజయానికి పలువురు ఆయుర్వేద వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ రికార్డు కేవలం అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి దక్కిన గౌరవమని డా. సుందర రాజ్ పెరుమాల్ పేర్కొన్నారు.

548 మందికి ఉచిత వస్తి కర్మ చికిత్స.. ఆయుర్వేద రంగంలో ప్రపంచ రికార్డు
అనకాపల్లి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం చారిత్రాత్మకంగా నిలిచింది. చరక జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు నిర్వహించిన శిబిరంలో 548 మంది రోగులకు ఉచితంగా వస్తి కర్మ చికిత్స అందించారు. వస్తి కర్మతో పాటు విద్ధ కర్మ, అగ్ని కర్మ వంటి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలను కూడా ఉచితంగా అందించారు. 548 మందికి ఉచితంగా వస్తి కర్మ నిర్వహించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని గుర్తించింది. సంస్థ భారతదేశ ముఖ్య అడ్జుడికేటర్ యతీష్ శుక్లా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి రికార్డు సర్టిఫికెట్, ట్రోఫీ, మెడల్‌ను ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, వరము చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. టి. సుందర రాజ్ పెరుమాల్‌కు అందజేశారు. ఈ మెగా శిబిరానికి “సౌత్ ఇండియన్ చరక”గా పేరొందిన డా. ఎన్. ఆంజనేయ మూర్తి మార్గదర్శకత్వం వహించారు. కార్యక్రమ విజయానికి పలువురు ఆయుర్వేద వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, నిర్వాహకులు కృషి చేశారు. ఈ రికార్డు కేవలం అవార్డు మాత్రమే కాదని, ఆచార్య చరకుని వారసత్వానికి, ఆయుర్వేద వైద్యుల సేవాభావానికి దక్కిన గౌరవమని డా. సుందర రాజ్ పెరుమాల్ పేర్కొన్నారు.

