Wednesday, 19 August 2026
  • Home  
  • తేరువుపల్లిలో ‘ఇంటింటా తెలుగుదేశం’.. కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై విస్తృత ప్రచారం
- అనకాపల్లి

తేరువుపల్లిలో ‘ఇంటింటా తెలుగుదేశం’.. కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై విస్తృత ప్రచారం

ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని తేరువుపల్లి గ్రామంలో ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతంగా నిర్వహించారు. బూత్ నంబర్లు 66, 67 పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తల్లికి వందనం, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, అన్న క్యాంటీన్లు, దీపం-2 వంటి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ), క్లస్టర్‌ ఇన్‌చార్జి కరణం రవికుమార్‌, ఏవీఎస్‌ నాయుడు, వార్డు అధ్యక్షుడు పిల్ల గంగాధర్‌, సెక్రటరీ తుంపాల గంగాధర్‌, తుంపాల కోటిపల్లి నాయుడు, గేదెల అప్పలనాయుడు, పిల్ల సత్యనారాయణ, గళ్ళ నూకినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని నాయకులు తెలిపారు.

ఎలమంచిలి, ఆగస్టు 19 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని తేరువుపల్లి గ్రామంలో ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతంగా నిర్వహించారు. బూత్ నంబర్లు 66, 67 పరిధిలో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
రోడ్లు, డ్రైనేజీ పనులు, భోగాపురం ఎయిర్‌పోర్టు, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తల్లికి వందనం, ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి, అన్న క్యాంటీన్లు, దీపం-2 వంటి సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్లె శివన్నారాయణ మూర్తి (నానాజీ), క్లస్టర్‌ ఇన్‌చార్జి కరణం రవికుమార్‌, ఏవీఎస్‌ నాయుడు, వార్డు అధ్యక్షుడు పిల్ల గంగాధర్‌, సెక్రటరీ తుంపాల గంగాధర్‌, తుంపాల కోటిపల్లి నాయుడు, గేదెల అప్పలనాయుడు, పిల్ల సత్యనారాయణ, గళ్ళ నూకినాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.