ఖమ్మం: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నరకుళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు బుధవారం మెమోరాండం సమర్పించారు. మధిర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని, రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వైరా ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మందనపు సుబ్బారావు, కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ వీర నాగేశ్వరరావు, చితనిప్పు రామారావుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు కిసాన్ మోర్చా వినతి