అనంతసాగరం ఆగష్టు 29,పున్నమి ప్రతినిధి :
సోమశిల జలశయాన్ని శనివారం డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ పరిశీలించింది..ఈ సందర్బంగా సేఫ్టీ కమిటీ సభ్యులు డ్యామ్ భద్రత, డ్యామ్ నిర్మాణ పరిస్థితి,నీటి నిల్వ సామర్ధ్యం తదితర అంశాలతో సమగ్రంగా పరిశీలన చేపట్టారు.. ఈ సందర్భంగా డ్యాం మ్యాప్ ను పరిశీలించి డ్యామ్ సేఫ్టీ కి సంబంధించిన వివిధ అంశాలను అధికారులు పరిశీలించారు. జలాశయం ప్రస్తుతం సురక్షితంగా ఉందా భవిష్యత్తులో ఎలాంటి భద్రతలు తీసుకోవాలా అని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.ఈ కార్యక్రమం లో డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, సోమశిల ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ రవీంద్ర ప్రసాద్, విజయ్ కుమార్, జేఈలు పెద్దిరాజు, పాపిశెట్టి నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.


