ఖమ్మం, ఆగస్టు 28: రక్షాబంధన్ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని నెహ్రూనగర్ వరలక్ష్మి నిలయంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి ధనమ్మ నామ నాగేశ్వరరావుకు రాఖీ కట్టి, మిఠాయి తినిపించారు. అనంతరం నామ తన సోదరి ధనమ్మతో ఆత్మీయంగా మాట్లాడి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆనందంగా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. సోదరసోదరీమణుల మధ్య ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు.
Uploaded Video:

