ఉదయగిరి: గండిపాలెం వెళ్లే జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రత్తయ్య అనే వ్యక్తిని ఉదయగిరి వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో రత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఉదయగిరి సామాజిక ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

గండిపాలెం హైవేపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు