పెద్దపల్లి, సెప్టెంబర్ 01:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల హక్కుల సాధన కోసం టీజీఈజేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘పెన్షన్ విద్రోహ దినం–చలో కలెక్టరేట్’ కార్యక్రమం పెద్దపల్లిలో విజయవంతమైంది. ఉద్యోగులు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారి న్యాయమైన హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, డీఏలు విడుదల చేసి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం అన్యాయమన్నారు. ఇదే క్రమంలో జిల్లా కన్వీనర్ తూము రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసనలో పాల్గొన్నాయని తెలిపారు. టీజీఓ జిల్లా కార్యదర్శి గండు సురేష్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను భారీ స్థాయిలో నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ, టీజీఓ, యూటీఎఫ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, మెడికల్, వెటరినరీ, తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి: టీజీఈజేఏసీ
పెద్దపల్లి, సెప్టెంబర్ 01: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల హక్కుల సాధన కోసం టీజీఈజేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘పెన్షన్ విద్రోహ దినం–చలో కలెక్టరేట్’ కార్యక్రమం పెద్దపల్లిలో విజయవంతమైంది. ఉద్యోగులు నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారి న్యాయమైన హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, డీఏలు విడుదల చేసి పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పాటు సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం అన్యాయమన్నారు. ఇదే క్రమంలో జిల్లా కన్వీనర్ తూము రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసనలో పాల్గొన్నాయని తెలిపారు. టీజీఓ జిల్లా కార్యదర్శి గండు సురేష్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను భారీ స్థాయిలో నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ, టీజీఓ, యూటీఎఫ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, మెడికల్, వెటరినరీ, తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

