Tuesday, 1 September 2026
  • Home  
  • 250 మందికి ఉచిత వైద్యం
- ప్రకాశం

250 మందికి ఉచిత వైద్యం

-అయ్యలూరివారిపల్లిలో పండుగలా 42వ బృహత్ వైద్య శిబిరం పామూరు, సెప్టెంబర్ 1 (ఆంధ్రప్రభ ): రమణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం సీ.ఎస్‌. పురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో నిర్వహించిన 42వ ఉచిత బృహత్ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 250 మందికి పైగా గ్రామస్థులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా బాహ్య రోగుల విభాగ పరీక్షలు చేయడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఆసుపత్రి అధినేత డాక్టర్ పి. మల్లికార్జున్ రెడ్డి సేవా నిరతిని స్థానికులు కొనియాడారు. గ్రామానికి చెందిన సమాన తిరుపతి, సమాన రమణయ్య, సమాన రమేష్, డి. కేశవరావు (గ్రామీణ వైద్యుడు) శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా అరటిపండ్లు, చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి ఆయన సామాజిక సేవలను అభినందించారు.

-అయ్యలూరివారిపల్లిలో పండుగలా 42వ బృహత్ వైద్య శిబిరం

పామూరు, సెప్టెంబర్ 1 (ఆంధ్రప్రభ ): రమణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం సీ.ఎస్‌. పురం మండలంలోని అయ్యలూరివారిపల్లి గ్రామంలో నిర్వహించిన 42వ ఉచిత బృహత్ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 250 మందికి పైగా గ్రామస్థులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా బాహ్య రోగుల విభాగ పరీక్షలు చేయడమే కాకుండా, రక్తపోటు, మధుమేహం వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ఆసుపత్రి అధినేత డాక్టర్ పి. మల్లికార్జున్ రెడ్డి సేవా నిరతిని స్థానికులు కొనియాడారు. గ్రామానికి చెందిన సమాన తిరుపతి, సమాన రమణయ్య, సమాన రమేష్, డి. కేశవరావు (గ్రామీణ వైద్యుడు) శిబిరానికి వచ్చిన రోగులకు ఉచితంగా అరటిపండ్లు, చల్లని మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి ఆయన సామాజిక సేవలను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.