ఆకలి తీర్చడమే అసలైన సేవ
-450 మందికి పైగా కార్మికులకు అన్నప్రసాదం పామూరు, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి ): పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా మల్లిఖార్జున రెడ్డి ఆధ్వర్యంలో, నెక్స్ట్ జెన్ రోబోటిక్స్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న 37వ అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సుమారు 450 మందికి పైగా సిమెంట్ వర్కర్లు, నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరికీ ఎలాంటి భేదభావం లేకుండా గౌరవంగా అన్నప్రసాదాన్ని అందించారు. పేదల ఆకలి తీర్చడం ద్వారా మానవత్వానికి పెద్దపీట వేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్న మల్లిఖార్జున రెడ్డిని ప్రశంసించారు.


