Sunday, 31 May 2026
  • Home  
  • బాలల కోసం భవిత పేరిట ప్రత్యేక కార్యక్రమాలు
- News

బాలల కోసం భవిత పేరిట ప్రత్యేక కార్యక్రమాలు

బాలలకు కోసం వినోదం, విజ్ఞానం, నైపుణ్యం అందించే కార్యక్రమాలను చేపడతాం. బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతాం ఇకపై ప్రతీ ఆదివారం చిన్నారులు మెచ్చేలా కార్యక్రమాలు రూపకల్పన అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విఎంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ విఎంఆర్డిఏ ద్వారా స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలలను వారికి నచ్చిన అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దటానికి బాల వికాస తరంగిణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని వి.ఎం.ఆర్.డి.ఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్, అన్నారు. వి ఎం ఆర్ డి ఏ అధ్వర్యంలో వైజాగ్ వాలంటీర్స్ సహకారంతో విఎంఆర్డిఏ చిల్డ్రన్ ధియేటర్ ఆవరణలో అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం బాలల సందడి – సాంసృతిక కార్యక్రమాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్ ., ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వి ఎం ఆర్ డి ఏ తరుపున బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారని, అయితే తర్వాతకాలంలో అనివార్య కారణాలతో అవి నిలిచిపోయాయని వివరించారు. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్., ల సూచనలతో తిరిగి బాలల కోసం కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బాలలకు వినోదం, విజ్ఞానం తో నైపుణ్యం అందించేలా వి.ఎం.ఆర్.డి.ఏ – భవిత పేరిట బాలలకు అవసరమైన, వారి సూచనలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని పేర్కొన్నారు. బాలలను రేపటి మేటి పౌరులుగా తీర్చిదిద్దేలా ఇకపై ప్రతి ఆదివారం చిల్డ్రన్ ధియేటర్ ను బాలల కోసం కేటాయిస్తామని పేర్కొన్నారు. నేటి బాలల అవసరాలను గుర్తించి, భవిష్యత్తు లో వారికి ఉపయోగపడేలా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బాలలకు సంబంధించి చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, భావ వ్యక్తీకరణ, ఏ ఐ సాంకేతికత ఇలా అన్ని అంశాల్లోనూ చిన్నారులు రాణించేలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతీ ఆదివారం కొత్తదనంతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భవిత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటుగా విఎంఆర్డిఏ నిర్వహణలో ఉన్న అన్ని మ్యూజియం ల్లో ఉచిత ప్రవేశం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో బాలల సంరక్షణ కేంద్రాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వి.ఎం.ఆర్.డి.ఏ ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ చిల్డ్రన్ ధియేటర్ లో ప్రతీ ఆదివారం చిన్నారులు మెచ్చేలా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీ కృష్ణ బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరవ ప్రకాశరావు, బాలల జిల్లా సంక్షేమ అధికారి హరి కృష్ణ, వైజాగ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంసృతిక కార్యక్రమాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నగరానికి చెందిన పలు బాలల సంరక్షణ కేంద్రాలకు చెందిన చిన్నారులు పాల్గొని తమ ఆట, పాటలతో, నృత్యాలతో సందడి చేశారు. ముఖ్యంగా ఆరాధన చిల్డ్రన్ హోం చిన్నారులు, సంకల్ప బాలల హోం, మనస్వి హోం, పాపా హోం, డాన్ బాస్కో తదితర సంస్థల చిన్నారులు తమ నృత్య ప్రదర్శన లతో మెప్పించారు. శివ తాండవం, యోగా నృత్య రూపకం ప్రదర్శనలతో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ ప్రాధాన్యత లను వివరిస్తూ నాటికలను ప్రదర్శించారు. ఇంద్రజాల ప్రదర్శన అబ్బురపరిచింది. పలువురు చిన్నారులు తమ సృజనాత్మక తో పలు సందేశాత్మక చిత్రాలను వేసి మెప్పించారు. బాలల సందడి కార్యక్రమం లో చిన్నారులు సంతోషంగా గడిపారు. అనంతరం చిన్నారులకు విఎంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్., పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించి, వారితో కొంత సమయం గడిపారు. అనంతరం చిన్నారులను బీచ్ రోడ్ లో ఉన్న కుర్ సురా సబ్ మెరైన్, టి యు-142 యుద్ధ విమానం,హెలికాప్టర్ మ్యూజియం లకు సందర్శన నిమిత్తం తీసుకువెళ్లారు.

బాలలకు కోసం వినోదం, విజ్ఞానం, నైపుణ్యం అందించే కార్యక్రమాలను చేపడతాం.

బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతాం

ఇకపై ప్రతీ ఆదివారం చిన్నారులు మెచ్చేలా కార్యక్రమాలు రూపకల్పన

అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విఎంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్

విఎంఆర్డిఏ ద్వారా స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలలను వారికి నచ్చిన అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దటానికి బాల వికాస తరంగిణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని వి.ఎం.ఆర్.డి.ఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్, అన్నారు. వి ఎం ఆర్ డి ఏ అధ్వర్యంలో వైజాగ్ వాలంటీర్స్ సహకారంతో విఎంఆర్డిఏ చిల్డ్రన్ ధియేటర్ ఆవరణలో అంతర్జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం బాలల సందడి – సాంసృతిక కార్యక్రమాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్ ., ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వి ఎం ఆర్ డి ఏ తరుపున బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారని, అయితే తర్వాతకాలంలో అనివార్య కారణాలతో అవి నిలిచిపోయాయని వివరించారు. వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్., ల సూచనలతో తిరిగి బాలల కోసం కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. బాలలకు వినోదం, విజ్ఞానం తో నైపుణ్యం అందించేలా వి.ఎం.ఆర్.డి.ఏ – భవిత పేరిట బాలలకు అవసరమైన, వారి సూచనలతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని పేర్కొన్నారు. బాలలను రేపటి మేటి పౌరులుగా తీర్చిదిద్దేలా ఇకపై ప్రతి ఆదివారం చిల్డ్రన్ ధియేటర్ ను బాలల కోసం కేటాయిస్తామని పేర్కొన్నారు. నేటి బాలల అవసరాలను గుర్తించి, భవిష్యత్తు లో వారికి ఉపయోగపడేలా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. బాలలకు సంబంధించి చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, భావ వ్యక్తీకరణ, ఏ ఐ సాంకేతికత ఇలా అన్ని అంశాల్లోనూ చిన్నారులు రాణించేలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతీ ఆదివారం కొత్తదనంతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ భవిత కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటుగా విఎంఆర్డిఏ నిర్వహణలో ఉన్న అన్ని మ్యూజియం ల్లో ఉచిత ప్రవేశం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో బాలల సంరక్షణ కేంద్రాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. వి.ఎం.ఆర్.డి.ఏ ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ చిల్డ్రన్ ధియేటర్ లో ప్రతీ ఆదివారం చిన్నారులు మెచ్చేలా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మురళీ కృష్ణ బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరవ ప్రకాశరావు, బాలల జిల్లా సంక్షేమ అధికారి హరి కృష్ణ, వైజాగ్ వాలంటీర్స్ వ్యవస్థాపకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాంసృతిక కార్యక్రమాలు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నగరానికి చెందిన పలు బాలల సంరక్షణ కేంద్రాలకు చెందిన చిన్నారులు పాల్గొని తమ ఆట, పాటలతో, నృత్యాలతో సందడి చేశారు. ముఖ్యంగా ఆరాధన చిల్డ్రన్ హోం చిన్నారులు, సంకల్ప బాలల హోం, మనస్వి హోం, పాపా హోం, డాన్ బాస్కో తదితర సంస్థల చిన్నారులు తమ నృత్య ప్రదర్శన లతో మెప్పించారు. శివ తాండవం, యోగా నృత్య రూపకం ప్రదర్శనలతో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ ప్రాధాన్యత లను వివరిస్తూ నాటికలను ప్రదర్శించారు. ఇంద్రజాల ప్రదర్శన అబ్బురపరిచింది. పలువురు చిన్నారులు తమ సృజనాత్మక తో పలు సందేశాత్మక చిత్రాలను వేసి మెప్పించారు. బాలల సందడి కార్యక్రమం లో చిన్నారులు సంతోషంగా గడిపారు. అనంతరం చిన్నారులకు విఎంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, ఐఏఎస్., పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించి, వారితో కొంత సమయం గడిపారు. అనంతరం చిన్నారులను బీచ్ రోడ్ లో ఉన్న కుర్ సురా సబ్ మెరైన్, టి యు-142 యుద్ధ విమానం,హెలికాప్టర్ మ్యూజియం లకు సందర్శన నిమిత్తం తీసుకువెళ్లారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.