Thursday, 16 July 2026
  • Home  
  • SC/ST అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి
- News

SC/ST అత్యాచారాల నిరోధక చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాది జావిద్ అలీ ఖాన్ పిలుపు ఆసిఫాబాద్, జూలై 17: రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని న్యాయవాది జావిద్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)పై జరిగే అత్యాచారాలు, వివక్ష, అవమానాలు, హింసను అరికట్టేందుకు రూపొందించిన SC/ST (Prevention of Atrocities) Act, 1989 అత్యంత కీలకమైన చట్టమని తెలిపారు. ఈ చట్టం ద్వారా బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు నేరం రుజువైన వారికి కఠినమైన శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. సమాజంలో బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే, ఏ చట్టాన్నైనా దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని జావిద్ అలీ ఖాన్ సూచించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేయడం లేదా తప్పుడు ఆధారాలతో కేసులు నమోదు చేయించడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత వ్యక్తులు భారతీయ చట్టాల ప్రకారం తగిన న్యాయపరమైన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారని వివరించారు. నిజమైన బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు, నిర్దోషులు అనవసరంగా ఇబ్బందులకు గురికాకుండా చూడడం కూడా న్యాయ వ్యవస్థ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించి సామాజిక సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాది జావిద్ అలీ ఖాన్ పిలుపు

ఆసిఫాబాద్, జూలై 17: రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని న్యాయవాది జావిద్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)పై జరిగే అత్యాచారాలు, వివక్ష, అవమానాలు, హింసను అరికట్టేందుకు రూపొందించిన SC/ST (Prevention of Atrocities) Act, 1989 అత్యంత కీలకమైన చట్టమని తెలిపారు.
ఈ చట్టం ద్వారా బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు నేరం రుజువైన వారికి కఠినమైన శిక్షలు విధించే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. సమాజంలో బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
అయితే, ఏ చట్టాన్నైనా దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని జావిద్ అలీ ఖాన్ సూచించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేయడం లేదా తప్పుడు ఆధారాలతో కేసులు నమోదు చేయించడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో సంబంధిత వ్యక్తులు భారతీయ చట్టాల ప్రకారం తగిన న్యాయపరమైన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారని వివరించారు.
నిజమైన బాధితులకు సత్వర న్యాయం అందించడంతో పాటు, నిర్దోషులు అనవసరంగా ఇబ్బందులకు గురికాకుండా చూడడం కూడా న్యాయ వ్యవస్థ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించి సామాజిక సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.