ఐక్యతకు నిదర్శనంగా వాకాడు ప్రెస్ క్లబ్ ఎన్నికలు యూనియన్,
రహస్య బ్యాలెట్ తో నూతన కమిటీ ఎంపిక,
23 మంది విలేకర్ల ఓటింగ్,
పున్నమి న్యూస్ డి హరికృష్ణ వాకాడు మండలం జూలై 16,
వాకాడు మండలంలో తొలిసారిగా జర్నలిస్టులందరూ ఒకే వేదిక పైకి వచ్చి ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండలానికి చెందిన 23 మంది విలేకరుల ప్రత్యేక రహస్య బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించి నూతన కమిటీని ఎంపిక చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరగడం విశేషంగా నిలిచింది. మండలంలోని జర్నలిస్టులంతా విభేదాలకు తావు లేకుండా ఐక్యంగా వ్యవహరించి ప్రజాస్వామ్యం స్ఫూర్తిని చాటారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ను మరింత బలోపేతం చేయడంతో పాటు విలేకరులు సంక్షేమ,వృత్తిపరమైన అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు ఆకాంక్షించారు.
ఎన్నికైన నూతన కమిటీ మెంబర్స్ :
*అధ్యక్షుడు:కుంచం కొండయ్య
* ఉపాధ్యక్షుడు: దామా విజయ్ కుమార్
* ప్రధాన కార్యదర్శి: ఎంబేటి సురేష్
* ట్రెజరర్ : బట్టా అనిల్ కుమార్
* కార్యదర్శి: మొర్ర రమణయ్య
* సహాయ కార్యదర్శులు : గురవయ్య, దాసరి వెంకటేష్
* పి ఆర్ ఓ : ముని రాజా
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అభినందనలు తెలియజేస్తూ, ప్రెస్ క్లబ్ ను ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.



