గంజాయి విక్రయాల కట్టడికి విస్తృత తనిఖీలు
ఖమ్మం, జూలై 16
(పున్నమి ప్రతినిధి) గుగులోత్
భావుసింగ్ నాయక్
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు గంజాయి విక్రయాలను అరికట్టేందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయిని చాక్లెట్లు, సిగరెట్లు, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారనే సమాచారంతో గురువారం కారేపల్లి, ఖమ్మం టౌన్, కూసుమంచి పోలీస్ స్టేషన్ల పరిధిలోని కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గంజాయి హాట్స్పాట్లపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ, పాన్‌షాపులు, కిరాణా దుకాణాల ముసుగులో అక్రమంగా మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


