శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి టెంపుల్ న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, పూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారాహి దీక్షను స్వీకరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ వారాహి దేవి నవరాత్రుల మహోత్సవాలను పురస్కరించుకుని ఆయన ఈ ప్రత్యేక దీక్షా కంకణాన్ని ధరించారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా వర్ధిల్లాలని, అభవృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నవరాత్రుల దీక్షా కాలంలో శ్రీ వారాహి అమ్మవారిని నిష్టతో ప్రత్యేకంగా ఆరాధిస్తానని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుఖశాంతులు, సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ ఆశయాలు నెరవేరాలని, రాష్ట్రానికి ఆయన సేవలందించేందుకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా సాయి ప్రసాద్ ఆకాంక్షించారు.

జనసేనాని ఆయురారోగ్యాల కోసం కొట్టే సాయి ప్రసాద్ వారాహి దీక్ష