సిద్ధవటంలోని శ్రీకామాక్షీసమేత సిద్ధవటేశ్వరస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ నుంచి మూడు రోజులుగా కొనసాగుతున్న ధ్వజస్తంభ మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, జపాలు నిర్వహించారు. అనంతరం నిర్ణయించిన సుముహూర్తం ఉదయం 10.51 గంటలకు నూతన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం ఆలయంలోని ఆయా దేవతలకు ఎనిమిది దిక్కుల్లో బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అవభృథం, మహదాశీర్వచనం నిర్వహించడంతో మహోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. ఆలయంలో ధ్వజస్తంభానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, స్వామివారి ఉత్సవాది కార్యక్రమాలకు ధ్వజారోహణ ఎంతో ముఖ్యమని వేదపండితులు వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యుడు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు వై. విజయకుమార్, వేదపండితులు గంటిరాధాకృష్ణశర్మ అవధాని, అర్చకులు, వైదిక సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ సిద్ధవటం, జ్యోతి ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించేలా తగిన ప్రచారం కల్పిస్తామన్నారు. ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆలయ కైంకర్యాలను ఆగమశాస్త్ర సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సిద్ధవటేశ్వర ఆలయంలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ