– ప్రజలతో మాట్లాడి భోజనం, సౌకర్యాలపై ఆరా
– పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచన
రైల్వేకోడూరు పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో ప్రజలకు అందుతున్న భోజనం నాణ్యత, సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. భోజనం చేసేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి క్యాంటీన్‌లో అందుతున్న ఆహారం నాణ్యత, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించడం అభినందనీయమన్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. భోజనం నాణ్యత, రుచి, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అన్న క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు.





