Wednesday, 26 August 2026
  • Home  
  • శోఠ్యం పంచాయితీ జీవీఎంసీలో విలీనంపై గ్రామ ప్రజలు కీలక డిమాండ్లు
- విశాఖపట్నం

శోఠ్యం పంచాయితీ జీవీఎంసీలో విలీనంపై గ్రామ ప్రజలు కీలక డిమాండ్లు

విశాఖపట్నం జిల్లా ఆనందపురం (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 25: శోంఠ్యం గ్రామ పంచాయతీని జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ పెద్దలు, ప్రజలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. విలీనానికి సంబంధించి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామసభలో ప్రధానంగా ప్రస్తావించిన డిమాండ్లు 1. పది సంవత్సరాల పాటు పన్నుల పెంపు ఉండకూడదు జీవీఎంసీలో విలీనం అనంతరం గ్రామ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా కనీసం 10 సంవత్సరాల పాటు ఎలాంటి పన్నుల పెంపు చేయకూడదని ప్రజలు కోరారు. 2. గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలి విలీనం జరిగినప్పటికీ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 10 సంవత్సరాల పాటు కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. 3. శోంఠ్యంలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలి జీవీఎంసీ పరిధిలోకి శోంఠ్యం వచ్చిన నేపథ్యంలో ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా శోంఠ్యం గ్రామంలోనే జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 4. ఖాళీ స్థలాలపై కూడా పది సంవత్సరాల పాటు పన్నుల పెంపు వద్దు గ్రామంలోని ఖాళీ స్థలాలపై విధించే పన్నుల్లో కూడా 10 సంవత్సరాల పాటు ఎలాంటి పెంపు చేయరాదని గ్రామ పెద్దలు, ప్రజలు స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని గ్రామసభలో పాల్గొన్న గ్రామ పెద్దలు, ప్రజలు కోరారు. ఈ అంశాలపై గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 25: శోంఠ్యం గ్రామ పంచాయతీని జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ పెద్దలు, ప్రజలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. విలీనానికి సంబంధించి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామసభలో ప్రధానంగా ప్రస్తావించిన డిమాండ్లు

1. పది సంవత్సరాల పాటు పన్నుల పెంపు ఉండకూడదు
జీవీఎంసీలో విలీనం అనంతరం గ్రామ ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడకుండా కనీసం 10 సంవత్సరాల పాటు ఎలాంటి పన్నుల పెంపు చేయకూడదని ప్రజలు కోరారు.

2. గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలి
విలీనం జరిగినప్పటికీ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 10 సంవత్సరాల పాటు కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

3. శోంఠ్యంలో జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలి
జీవీఎంసీ పరిధిలోకి శోంఠ్యం వచ్చిన నేపథ్యంలో ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా శోంఠ్యం గ్రామంలోనే జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

4. ఖాళీ స్థలాలపై కూడా పది సంవత్సరాల పాటు పన్నుల పెంపు వద్దు
గ్రామంలోని ఖాళీ స్థలాలపై విధించే పన్నుల్లో కూడా 10 సంవత్సరాల పాటు ఎలాంటి పెంపు చేయరాదని గ్రామ పెద్దలు, ప్రజలు స్పష్టం చేశారు.

విలీన ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని గ్రామసభలో పాల్గొన్న గ్రామ పెద్దలు, ప్రజలు కోరారు. ఈ అంశాలపై గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.