నంద్యాల:నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మిగిలి ఉన్న పనులను నాణ్యతతో, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వసతులతో త్వరలోనే ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, టిడిపి నాయకులు ఎన్.ఎం.డి. ఫయాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

త్వరలోనే టిడ్కో ఇళ్ల పంపిణీ: మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల:నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మిగిలి ఉన్న పనులను నాణ్యతతో, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వసతులతో త్వరలోనే ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, టిడిపి నాయకులు ఎన్.ఎం.డి. ఫయాజ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

