ఉదయగిరి ఎంపీపీ పాఠశాల దళితవాడలోని లలిత కేంద్రంలో మండల విద్యాశాఖాధికారి టి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. మానసిక దివ్యాంగ చిన్నారులకు తొమ్మిది టీఎల్‌ఎం (టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్) కిట్లు, ఒక వీల్‌చైర్‌ను అందజేశారు. అనంతరం భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ శిబిరాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సేవలపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగ చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సేవలు మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ – సేవలను పరిశీలించిన మండల విద్యాశాఖాధికారి