– చిట్వేల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
– రాధాకృష్ణన్ సేవలను గుర్తుచేసుకున్న ఎంఈఓ
– ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిపై రాధాకృష్ణన్‌కు ఉన్న అంకితభావం, విద్యార్థుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఆదర్శమన్నారు. విద్యార్థులు, సమాజం అభివృద్ధి చెందితేనే ఉపాధ్యాయులకు నిజమైన గౌరవం లభిస్తుందన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, కాలేశా, నారాయణరెడ్డి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. నగిరిపాడు పాఠశాల ఉపాధ్యాయుడు పెద్దిరెడ్డి, చెర్లోపల్లి ఉపాధ్యాయురాలు జయమ్మ, నగిరిపాడు ఉప్పరపల్లి ఉపాధ్యాయురాలు లక్ష్మీప్రసన్నలను మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించారు. ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

