Wednesday, 26 August 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సన్నాహక సమావేశం
- తిరుపతి

శ్రీకాళహస్తిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సన్నాహక సమావేశం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోయే సెప్టెంబర్ 2వ తేదీ జన్మదినోత్సవాన్ని నియోజకవర్గవ్యాప్తంగా చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు మంగళవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకుడు కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అత్యంత అట్టహాసంగా, ప్రజాక్షేత్రంలో నిర్వహించే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. జనసేనాని పుట్టినరోజు వేడుకలను ప్రజలకు మరింత చేరువ చేసేలా విస్తృత స్థాయిలో అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, వస్త్ర వితరణ వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే యువతను పెద్ద ఎత్తున ఆకట్టుకునేలా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనపై నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తమ తమ విలువైన సూచనలు, సలహాలను అందించాలని కోరారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు పరిధిలో అత్యంత వైభవంగా, ప్రతి ఒక్క జనసైనికుడు ఉత్సాహంగా భాగస్వామి అయ్యేలా నిర్వహించాలని ఈ సన్నాహక సదస్సులో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల జనసేన ముఖ్య ప్రతినిధులు, పట్టణ నాయకులు, పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.