నంద్యాల:హైదరాబాద్‌లోని ప్రముఖ యశోద ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సేవల్లో భాగంగా ప్రత్యేక ఈసీఎంఓ (ECMO) కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
తీవ్ర అనారోగ్యంతో గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్షీణించిన రోగులకు ఈసీఎంఓ చికిత్స ప్రాణదానంగా నిలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. 24 గంటలూ నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది పర్యవేక్షణలో ఈ సేవలు అందుతాయని వివరించారు. గుండెపోటు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు, అవయవ మార్పిడి మరియు అత్యవసర చికిత్స విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఈ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ సుమంత్ రెడ్డి, మార్కెటింగ్ ప్రతినిధి బాబయ్య తదితరులు పాల్గొన్నారు.



