Tuesday, 14 July 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ఆంజనేయస్వామి విశేష అభిషేకాలు
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ఆంజనేయస్వామి విశేష అభిషేకాలు

శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి టెంపుల్ న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలోని 16 కాళ్ల మండపములో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారికి వేద మంత్రోచ్చారణల మధ్య విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, ధూప దీప నైవేద్యములతో మహా హారతి సమర్పించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ ఆంజనేయస్వామి వారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలను పొందారు. దేవస్థాన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి భక్తులను ఆశీర్వదించారు. ఆంజనేయస్వామి వారి విశేష అభిషేకాలు, అలంకరణలు, మహా హారతి దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.