పల్లె నిద్రలో పోలీసుల హెచ్చరిక.. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలి
పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)
యలమంచిలి: యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం యలమంచిలి రూరల్ సీఐ ధనుంజయ రావు తో కలిసి పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని పోలీసులకు సహకారం అందించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించడం, అనవసర వివాదాలకు పాల్పడటం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మహిళలు, చిన్నారుల రక్షణపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు, అధికారులకు పూర్తిగా సహకరించాలని గ్రామస్తులు, రాజకీయ నాయకులను కోరారు.


