రాజంపేట కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనులు
రాజంపేట: రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్ రాజు ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ తన సొంత నిధులతో రాజంపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
మార్కెట్ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు జేసీబీలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసి శుభ్రపరిచారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు.

