రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా వందలాదిమంది పాల్గొని, పుట్టిన ఊరు రుణం తీర్చుకుందాం అని, రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం సాధిద్దామని నూనెపల్లి శివాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని ముక్తకంఠంతో తీర్మానించారు. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న నూనెపల్లె ప్రాంతంలో అనేక వ్యాపార సంస్థలు బెన్నీ కంపెనీ, మార్కెట్ యార్డు, ప్రభుత్వ ఆసుపత్రి లాంటి ప్రాంతాలు ఉండి విశాలమైన వీధులతో నిత్యం కళకళలాడుతూ ఉండేదని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల అది కుగ్రామంగా మారిపోయిందని, అయినప్పటికీ 30 గ్రామాల నుంచి రైల్వే ట్రాక్ ను దాటి వేలాదిమంది ఈ ప్రాంతానికి రావడం వల్ల ప్రజల జీవన ఉపాధి కొనసాగుతున్నదని, కొత్తగా ఏర్పాటు చేసే రెండవ రైల్వే ట్రాక్ వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం పూర్తిగా కుగ్రామంగా మారిపోయే పరిస్థితి ఉందని అందుకే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం జరగాలని, గత ఏడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు విఫలం అయినాయని, ప్రస్తుతం గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ గారు ఈ ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మిస్తామని, అయితే రాష్ట్ర ప్రభుత్వము స్థల సేకరణ చేసి ఇవ్వాలని కలెక్టర్ గారికి లెటర్ పంపడం జరిగినది. ఆ విషయంలో స్థానిక మంత్రివర్యులు ఫరూక్ గారు, అలాగే పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని త్వరగా నష్టపరిహార అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని అధికారులను చెప్పి ఉన్నారని, అయినప్పటికీ ఇప్పటికీ 10 మాసాలుగా అందులో ఎలాంటి పురోగతి లేకపోవడం దురదృష్టకరమని, వందేమాతరం స్ఫూర్తితో మన ఊరు ఋణం తీర్చుకుందాం అనేటువంటి పట్టదలతో ఈరోజు శివాలయంలో అన్ని వర్గాల ప్రజలు వందలాది మంది పాల్గొని ఇక ఉద్యమాన్ని ప్రారంభించాలని, ఆ ఉద్యమం 28.9.2026 నుంచి నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని ఈ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం జరిగేంతవరకు ఆ ఉద్యమాన్ని కొనసాగింపు క్రమంలో అనేక ఉద్యమ పరిణామాలకు ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాల్సి వస్తుందని నూనెపల్లె ప్రజలు ఈ సమావేశంలో హెచ్చరిస్తూ థీర్మానించడం జరిగింది.

నూనెపల్లి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ సాధనకై ఉద్యమం: