చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణ రజక సంఘం అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ కమిటీ సభ్యులు గడ్డమిది బాలకృష్ణ ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కొల్లూరు లక్ష్మీనారాయణ గడ్డమీది బాలకృష్ణ మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం పేదలు, రైతులు, కూలీలకు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
నేటికీ పేదలు, రైతులు, కార్మికులు, కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలే మార్గమన్నారు. భూమి, ఉపాధి, కనీస వేతనాలు, తాగునీరు, ఇళ్లు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి ప్రజల మౌలిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే పాలనా విధానాలను ప్రశ్నిస్తూ, పేద–మధ్యతరగతి ప్రజలపై భారాలు పడకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, యువతను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం!
దోపిడీ–అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం
ప్రజా హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమిద్దాం ఈ యొక్క కార్యక్రమంలో తడిగోప్పుల మల్లేష్ ఇల్లందుల సాంబయ్య పున్నం రాజు వావిళ్ళ ఈశ్వర్ గుడి కందుల సదానందం కొల్లూరి మధుకర్ కుర్ర రాహుల్ జిల్లా పెళ్లి దినేష్ స్వామి బాబు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు

దోపిడీ–అణచివేతపై తిరుగుబాటు జెండా ఐలమ్మ ప్రజా హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం-నర్సంపేట రజక సంఘం పట్టణ అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నర్సంపేట పట్టణ రజక సంఘం అధ్యక్షులు కొల్లూరు లక్ష్మీనారాయణ కమిటీ సభ్యులు గడ్డమిది బాలకృష్ణ ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లూరు లక్ష్మీనారాయణ గడ్డమీది బాలకృష్ణ మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం తెలంగాణ ప్రజా ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం పేదలు, రైతులు, కూలీలకు నేటికీ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. నేటికీ పేదలు, రైతులు, కార్మికులు, కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలే మార్గమన్నారు. భూమి, ఉపాధి, కనీస వేతనాలు, తాగునీరు, ఇళ్లు, విద్య, వైద్యం, సామాజిక భద్రత వంటి ప్రజల మౌలిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే పాలనా విధానాలను ప్రశ్నిస్తూ, పేద–మధ్యతరగతి ప్రజలపై భారాలు పడకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, యువతను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం! దోపిడీ–అణచివేతకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం ప్రజా హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమిద్దాం ఈ యొక్క కార్యక్రమంలో తడిగోప్పుల మల్లేష్ ఇల్లందుల సాంబయ్య పున్నం రాజు వావిళ్ళ ఈశ్వర్ గుడి కందుల సదానందం కొల్లూరి మధుకర్ కుర్ర రాహుల్ జిల్లా పెళ్లి దినేష్ స్వామి బాబు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు

