Saturday, 29 August 2026
  • Home  
  • రోడ్డు వేశారు.. నీళ్లు పోయడం మరిచారు! డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో నాసిరకం పనులా ?????
- రంగారెడ్డి

రోడ్డు వేశారు.. నీళ్లు పోయడం మరిచారు! డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో నాసిరకం పనులా ?????

రోడ్డు వేశారు.. నీళ్లు పోయడం మరిచారు! డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో నాసిరకం పనులా? రోడ్డు వేసి వారం రోజులు గడుస్తున్నా క్యూరింగ్‌ ఊసే లేదు.. అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు హయత్‌నగర్‌: ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని హయత్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో ఇటీవల చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, రోడ్డు వేసిన అనంతరం నిబంధనల ప్రకారం నీటిని పోసి క్యూరింగ్‌ చేయాల్సి ఉన్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో క్యూరింగ్‌ ప్రక్రియకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు వేసిన తర్వాత క్రమం తప్పకుండా నీటిని పోయకపోవడంతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మిస్తున్న రోడ్డు కొద్ది కాలానికే దెబ్బతింటే అందుకు బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తయ్యాయా.. బిల్లులు కూడా పూర్తేనా? ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనుల నాణ్యతపై పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు వేసిన సమయంలో అధికారులు పనులను పరిశీలించారా? కాంట్రాక్టర్‌ నిబంధనల ప్రకారం పనులు చేపట్టారా? రోడ్డు వేసిన తర్వాత క్యూరింగ్‌ ప్రక్రియను ఎందుకు పర్యవేక్షించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు స్పందించాలి డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో చేపట్టిన రోడ్డు పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్‌, పనుల నాణ్యత, మందం తదితర అంశాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగాయా లేదా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్డు వేసిన తర్వాత సరైన క్యూరింగ్‌ చేయకపోవడం వల్ల భవిష్యత్‌లో రోడ్డు దెబ్బతింటే మళ్లీ ప్రజాధనంతోనే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. “రోడ్డు వేయడం మాత్రమే కాదు.. వేసిన రోడ్డు ఎక్కువ కాలం మన్నేలా చూడటం కూడా అధికారుల బాధ్యతే” అని స్థానికులు పేర్కొంటున్నారు.

రోడ్డు వేశారు.. నీళ్లు పోయడం మరిచారు!

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో నాసిరకం పనులా?

రోడ్డు వేసి వారం రోజులు గడుస్తున్నా క్యూరింగ్‌ ఊసే లేదు.. అధికారుల పర్యవేక్షణపై స్థానికుల ప్రశ్నలు

హయత్‌నగర్‌: ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని హయత్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో ఇటీవల చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, రోడ్డు వేసిన అనంతరం నిబంధనల ప్రకారం నీటిని పోసి క్యూరింగ్‌ చేయాల్సి ఉన్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు నిర్మాణంలో క్యూరింగ్‌ ప్రక్రియకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం రోడ్డు వేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు వేసిన తర్వాత క్రమం తప్పకుండా నీటిని పోయకపోవడంతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మిస్తున్న రోడ్డు కొద్ది కాలానికే దెబ్బతింటే అందుకు బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పనులు పూర్తయ్యాయా.. బిల్లులు కూడా పూర్తేనా?

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు రోడ్డు పనులకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పనుల నాణ్యతపై పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు వేసిన సమయంలో అధికారులు పనులను పరిశీలించారా? కాంట్రాక్టర్‌ నిబంధనల ప్రకారం పనులు చేపట్టారా? రోడ్డు వేసిన తర్వాత క్యూరింగ్‌ ప్రక్రియను ఎందుకు పర్యవేక్షించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారులు స్పందించాలి

డిఫెన్స్‌ కాలనీ రోడ్‌ నంబర్‌–4లో చేపట్టిన రోడ్డు పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్‌, పనుల నాణ్యత, మందం తదితర అంశాలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగాయా లేదా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రోడ్డు వేసిన తర్వాత సరైన క్యూరింగ్‌ చేయకపోవడం వల్ల భవిష్యత్‌లో రోడ్డు దెబ్బతింటే మళ్లీ ప్రజాధనంతోనే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

“రోడ్డు వేయడం మాత్రమే కాదు.. వేసిన రోడ్డు ఎక్కువ కాలం మన్నేలా చూడటం కూడా అధికారుల బాధ్యతే” అని స్థానికులు పేర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.