Friday, 4 September 2026
  • Home  
  • రోడ్డు దాటుతుండగా జీప్‌ ఢీకొని బాలుడు మృతి
- తిరుపతి

రోడ్డు దాటుతుండగా జీప్‌ ఢీకొని బాలుడు మృతి

మండలంలోని సదనవారిపాలెం సమీపంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలుడిని జీప్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున వివరాలు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీఎన్‌ కండ్రిగ మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన గారట వెంకటసుబ్బయ్య (6), వెంకటరమణ కుమారుడు. బాలుడి అవ్వ, తాత సదనవారిపాలెం సమీపంలోని మామిడి తోటలో కాపలాగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం వెంకటసుబ్బయ్య అవ్వ, తాత వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన జీప్‌ బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఘటనపై వరదయ్యపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన జీప్‌, డ్రైవర్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

మండలంలోని సదనవారిపాలెం సమీపంలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆరేళ్ల బాలుడిని జీప్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున వివరాలు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీఎన్‌ కండ్రిగ మండలం లక్ష్మీపురం ఎస్టీ కాలనీకి చెందిన గారట వెంకటసుబ్బయ్య (6), వెంకటరమణ కుమారుడు. బాలుడి అవ్వ, తాత సదనవారిపాలెం సమీపంలోని మామిడి తోటలో కాపలాగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం వెంకటసుబ్బయ్య అవ్వ, తాత వద్దకు వచ్చాడు.
ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన జీప్‌ బాలుడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఘటనపై వరదయ్యపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన జీప్‌, డ్రైవర్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.